వెస్పా భారత మార్కెట్ కోసం సరికొత్త స్కూటర్‌ను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో దీని ధర రూ. 14 లక్షలకు పైగా ఉండవచ్చని తెలుస్తుంది. ఈ స్కూటర్ పేరు వెస్పా 946 డ్రాగన్ ఎడిషన్ అని తెలుస్తోంది. ఇది హాంకాంగ్ లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ డే నుండి ప్రేరణ పొందిన పరిమిత ఎడిషన్ స్కూటర్. ఈ స్కూటర్‌ను ప్రపంచవ్యాప్తంగా 1888 యూనిట్లు మాత్రమే విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.