Homeఅంతర్జాతీయంచైనా నుంచి మరో కొత్త వైరస్

చైనా నుంచి మరో కొత్త వైరస్

చైనా కొత్త వైరస్​లకు మాతృభూమిగా మారుతుంది. చైనా దాచిన కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో దాదాపు 20 మిలియన్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అంతే కాకుండా లక్షలాది మంది మరణించారు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇక తాజాగా చైనాలో మరో కొత్త వైరస్​ ప్రపంచాన్ని బయపెట్టేలా మారబోతున్నట్లు తెలుస్తుంది. టిక్ బోర్న్ అనే ఈ వైరస్​ కారణంగా చైనాలో ఇప్పటికే 7 మంది మరణించారు. ఒకరినుంచి ఒకరికి ఈ వైరస్​ వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ వైరస్ రక్తం లేదా శ్లేష్మం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈగలతో పాటు, వలస పక్షులు వైరస్ యొక్క వాహకాలుగా భావిస్తున్నారు. మానవులు, గొర్రెలు, పశువులు, గుర్రాలు, పందులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ వైరస్​తో మనుషుల్లో తీవ్రమైన జ్వరం వస్తుందని, దీనితో మరణాల రేటు 6 శాతం ఉన్నట్లు శాస్త్రవెత్తలు చెబుతున్నారు. అంటే ఇది కరోనా మరణాల రేటు కంటే ఎక్కువ. అంతే కాకుండా దీనికి కూడా ఇప్పటి వరకు సరైన మందు అందుబాటులో లేకపోవడం కాస్త ఆందోళన చెందదాల్సిన విషయమే.

Recent

- Advertisment -spot_img