– అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్‌కు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేత
ఇదే నిజం, నాగార్జునసాగర్ : నందికొండ మునిసిపాలిటీలో అవిశ్వాస తీర్మానం చేసినట్లు కౌన్సిలర్లు తెలిపారు. మునిసిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో చైర్మన్, వైస్ చైర్మన్ మినహా పది మంది సభ్యులు ఉన్నారు. వారిగా ఒకరు అకాల మృతి చెందడంతో తొమ్మిదిమంది కౌన్సిలర్లు నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్‌ను కలిసి తమ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ విషయంపై స్పందించిన అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ మునిసిపాలిటీలో కౌన్సిల్ మీటింగ్ అనంతరం దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో తిరుమలకొండ మోహన్ రావు, ఈర్ల రామకృష్ణ, శిరీష మోహన్‌నాయక్, హిరేకార్ రమేష్, నిమ్మల ఇందిరా , అన్నపూర్ణ, నాగరాణి, శ్వేత పాల్గొన్నారు.