Homeజాతీయంమిడతల జాడ మాయం

మిడతల జాడ మాయం

ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద మిడతల జాడ మాయం
‘ఆహారం, వ్యవసాయ సంస్థ’ తాజా నివేదిక ప్రకారం, భారత్‌-పాకిస్థాన్‌ వేసవి సంతానోత్పత్తి ప్రాంతానికి దాదాపుగా తగ్గిపోయిన మిడతల దండు వలసలు

ఈ ఏడాది ఏప్రిల్‌ 11 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానాలోని 2,79,066 హెక్టార్ల పంట ప్రాంతంలో మిడతల నియంత్రణ చర్యలు చేపట్టారు. మిడతల ప్రాంతీయ కార్యాలయాల (ఎల్‌సీవోలు) ద్వారా ఈ చర్యలు చేపట్టారు. ఆగస్టు 25 నాటికి.., రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, బిహార్‌లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2,87,374 హెక్టార్లలో నియంత్రణ చర్యలు పూర్తి చేశాయి.

    మంగళవారం, ప్రభావిత ప్రాంతాల్లో మిడతల జాడ కనిపించలేదు. అయినా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సరిపడా వాహనాలు, స్ప్రే పరికరాలతో, సర్వే, నియంత్రణ కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. మిడతలు ఇంకా మిగిలివుంటే, వాటిని గుర్తించి నాశనం చేయడానికి ఎస్‌సీవోలు గట్టిగా పనిచేస్తున్నాయి.

    ఈనెల 24 నాటి ‘ఆహారం, వ్యవసాయ సంస్థ’ నివేదిక ప్రకారం, భారత్‌-పాకిస్థాన్‌ వేసవి సంతానోత్పత్తి ప్రాంతానికి మిడతల దండు వలసలు దాదాపుగా తగ్గిపోయాయి. ఎడారి మిడతల పరిస్థితిపై, నైరుతి ఆసియా దేశాల (ఆఫ్ఘనిస్థాన్‌, భారత్‌, ఇరాన్‌, పాకిస్థాన్‌) వారపు సమావేశాన్ని ఎఫ్‌ఏవో నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 23 వర్చువల్‌ సమావేశాలు పూర్తయ్యాయి.

Recent

- Advertisment -spot_img