ఇదే నిజం కమలాపూర్: కమలాపూర్ నుండి కన్నూరు గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా వెళ్ళుతున్న తాగు నీరు సౌకర్యానికి సంభంధించిన పైపు లైను ద్వార నీరు లీకిజ్ తో వృధా అవుతుంది దీని ద్వారా పంట పొలాల యజమానులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటి కొరకు ఏర్పాటు చేసిన పైపు లైనును సక్రమంగా ఉండేటట్లు చూసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పై అధికారులకు అనేక సార్లు విన్నవించినా నిమ్మకు నీరెత్తినట్లు నడుచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైపు లైనుల లింకుల లీకేజీలని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. అంతేకాక పొలాల్లో పంటలకు వేసిన రసాయనిక ఎరువులు , క్రిమిసంహారక మందుల నీరు పైపులలోకి వెళ్ళడం వలన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. వీలైనంత తొందరగా పనులు చేయకపోతే అధికారులని నిర్భందం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు