HomeరాజకీయాలుKCR పాలనలో ఎవరూ సంతోషంగా లేరు : Etala Rajender

KCR పాలనలో ఎవరూ సంతోషంగా లేరు : Etala Rajender

– బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే గజ్వేల్​లో నేనెందుకు పోటీ చేస్త?
– కాంగ్రెస్​ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్

ఇదే నిజం, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ పాలనలో దళితులు, బీసీలు, రైతులు.. ఎవరూ సంతోషంగా లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే ‘బీసీ బంధు’ దక్కిందని ఆయన ఆరోపించారు. అసైన్డ్‌, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారని.. రూ. లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే తానెందుకు గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఈటల అన్నారు. ఆ పార్టీని గద్దె దించడం బీజేపీకే సాధ్యమని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్​లో చేరారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Recent

- Advertisment -spot_img