HomeరాజకీయాలుNominations : ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిగా తుమ్మల నామినేషన్​

Nominations : ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిగా తుమ్మల నామినేషన్​

– ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తానంటూ ప్రకటన

ఇదేనిజం, హైదరాబాద్​: ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తుమ్మల నామినేషన్​ దాఖలు చేశారు. తాను ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తానంటూ ప్రకటించారు. సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆశీస్సులతో ఖమ్మం అభ్యర్థిగా నామినేషన్ వేశానని తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆధునిక ఖమ్మం రూపశిల్పిగా ఖమ్మం ప్రజానీకం ఆకాంక్షల కోసం పనిచేస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని… సోనియా గాంధీ రుణం తీర్చుకుకుందామని పిలుపిచ్చారు. ఆరు గ్యారంటీ పథకాలు అమలు తెలంగాణకు మంచి భవిష్యత్ అని, నిరంకుశ అవినీతి, ఆప్రజా స్వామికపాలనకు వ్యతిరేకంగా ఖమ్మంతో పాటు యావత్ తెలంగాణ ప్రజానీకం చారిత్రక తీర్పు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img