Homeహైదరాబాద్latest Newsరీల్ హీరో కాదు.. రియల్ హీరో.. వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్‌.. అంతేకాకుండా..

రీల్ హీరో కాదు.. రియల్ హీరో.. వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న మోహన్‌లాల్‌.. అంతేకాకుండా..

కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య శనివారం నాటికి 358కి చేరుకుంది. మోహన్‌లాల్ టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్. సైనిక శిబిరానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలకు నాయకత్వం వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. విపత్తు తీవ్రతను ప్రత్యక్షంగా చూస్తేనే అర్థమవుతుందని అన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, NDRF, అగ్నిమాపక, పోలీసు విభాగాలు రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన స్థానిక ప్రజలు అద్భుతమైన పని చేసారు.

వయనాడ్ కు సినీ హీరో మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం
మోహన్ లాల్ వయనాడ్ కు భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితులకు పునరావాసాల కోసం మోహన్ లాల్ ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్లు అందించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img