Homeహైదరాబాద్latest Newsటిల్లుకు సపోర్టుగా ఎన్టీఆర్

టిల్లుకు సపోర్టుగా ఎన్టీఆర్

గతంలో సూపర్ హిట్ అయిన ‘డీజే టిల్లు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చి ‘టిల్లు స్క్వేర్’ సంచలన విజయం అందుకుంది. ఫస్ట్ పార్టులో సిద్ధూ జొన్నలగడ్డ.. నేహా శెట్టి జంటగా నటించగా.. సెకండ్ పార్టులో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించించింది. ఈ మూవీ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంస్ ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించాయి.

‘టిల్లు స్క్వేర్’ గత వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల వేట కొనసాగిస్తుంది. మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. మొదటి రోజే రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ‘టిల్లు స్క్వేర్’ సూపర్‌హిట్‌ అవడంతో.. మూవీటీం సక్సెస్‌మీట్ నిర్వహించనుంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img