– వైైద్యాధికారి డాక్టర్ విష్ణు
ఇదే నిజం, గోరికొత్తపల్లి/రేగొండ : ప్రతీ గర్భిణి, కిశోర బాలికలు న్యూట్రిషన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక వైైద్యాధికారి డాక్టర్ విష్ణు తెలిపారు. శుక్రవారం రేగొండ ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణులకు కిట్లను అందజేశారు. కిట్‌లో ఉండే వస్తువులు కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జురా ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయని వైద్యులు వివరించారు. ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ లను పోషక ఆహారం ద్వారా అందించి రక్త హీనతను తగ్గించడం హీమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రిషన్ కిట్ల యొక్క లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హిమ బిందు, సుధ, ఆశ వర్కర్స్ సుభద్ర, గర్భిణులు పాల్గొన్నారు.