Homeలైఫ్‌స్టైల్‌శృంగార సామ‌ర్థ్యం, ఆసక్తి పెంచే గింజ‌ప‌ప్పులు

శృంగార సామ‌ర్థ్యం, ఆసక్తి పెంచే గింజ‌ప‌ప్పులు

బాదం, జీడిపప్పు, అక్రోట్ల వంటి గింజపప్పులు (నట్స్‌) శృంగార ఆసక్తిని పెంచుతాయ‌ని అధ్య‌య‌నంలో తేలింది. ఇవి శృంగార జీవితం మెరుగుపడటానికీ తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది.

వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు కూడ అదుపులో ఉంటుద‌ట‌. న‌డి వ‌య‌సులో ఉత్సాహం, మేధోశక్తి, మూడ్‌ పుంజుకోవటం వరకూ ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు తేల్చాయి.

రోజుకు 60 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం గమనార్హం.

తాజా పండ్లు, కూరగాయలు తక్కువగా ఉండే పాశ్చాత్య ఆహార అలవాట్లు గల కొందరిపై పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు.

కొందరికి తమ మామూలు ఆహారం, మరికొందరికి బాదం, అక్రోట్లు, హేజెల్‌ నట్స్‌ కూడా తినమని సూచించారు. ఇలా 14 వారాలు చేసిన తర్వాత వారిలో వ‌చ్చిన మార్పులను తెలుసుకున్నారు.

గింజపప్పులు తీసుకున్న వారిలో శృంగారాసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి.

గింజ‌ప‌ప్పులో ఉండే ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ స్తంభనలోపం తగ్గటానికే కాకుండా గుండె రక్తనాళ వ్యవస్థకూ మేలు చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారానికి గింజపప్పులనూ జోడించినట్టయితే అంగ స్తంభన, శృంగారాసక్తి మెరుగయ్యే అవకాశమున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img