Homeహైదరాబాద్latest News" మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం"

” మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం”

ఇదే నిజం మంచిర్యాల జిల్లా : మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పయ్యావుల పద్మ, వైస్ చైర్మన్ గా బండారి సుధాకర్ లు డైరెక్టర్లచే ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేయించారు. గత ప్రభుత్వాలు డబ్బులకు అమ్ముడుపోయి వ్యవసాయంపై అవగాహన లేని వ్యక్తులకు చైర్మన్ వైస్ చైర్మన్ పదవిలను అంటగట్టారని, రైతుల ఇబ్బందులను గుర్తించలేని చైర్మన్లు ఉన్న లేకున్నా ఒకటేనని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మారుమూల ప్రాంతమైన ర్యాలీగాడ్ పూర్ గిరిజన ప్రాంతానికి చెందిన పయ్యావుల పద్మ వ్యవసాయ కూలీగా పనిచేసిందని, రైతాంగం సమస్యను పరిష్కరించగల అవగాహన ఉన్న వ్యక్తులకే మంచిర్యాల నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంలో బాధ్యతలు అందజేశామని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రైతులకు, సాగునీరు అందించే దిశగా గూడెం ఎత్తిపోతల పథకం నుంచి రెండు టీఎంసీల నీరును అందించామని 200 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. రాష్ట్రంలోనే మంచిర్యాల ను మరో 30 ఏళ్లు ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, విద్య, వైద్యం, రైతుల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రమాణస్వీకారణ అనంతరం సమావేశంలో తెలిపారు.

Recent

- Advertisment -spot_img