Homeహైదరాబాద్latest NewsLife Skills for Office Politics : ఆఫీస్ పాలిటిక్స్ ఆ ..మీ అంత అదృష్టవంతులే...

Life Skills for Office Politics : ఆఫీస్ పాలిటిక్స్ ఆ ..మీ అంత అదృష్టవంతులే లేరని చెప్పాలి?

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఆఫీస్ పాలిటిక్స్. ప్రస్తుతం ఉన్న సామాజిక సమస్యల్లో ఇదొకటి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ ధోరణి ఎక్కువగా కనబడుతుంది. పెద్దపెద్ద కంపెనీల్లో పరిస్థితులు చక్కగానే ఉంటున్నా స్టార్టప్‌ల్లో, చిన్నచిన్న కంపెనీల్లో ఇవి ఉద్యోగులకు తలనొప్పిగా మారుతున్నాయి.

వాస్తవానికి ఒక సంస్థలో పనిచేసే వ్యక్తులు భిన్న ప్రాంతాల నుంచి ఉంటారు. వాళ్ల ఆసక్తులు, అభిరుచులు, లక్ష్యాలు, డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ సంస్థలో రాణించడం కోసమో లేదా వ్యక్తిగతంగా ఎదగడం కోసమో ఎవరికి వారు విశ్వప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు సహోద్యోగికి మంచి చెప్పే ప్రయత్నం చేసినా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇతరుల తప్పులను అందిరిముందూ ఎత్తిచూపితే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని గానీ సమూహాన్ని గానీ సద్విమర్శ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు మంచి రిలేషన్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అటువంటివి కేవలం మీమీదే గాక మొత్తం సంస్థ పనితీరుమీద ప్రభావం చూపే వీలుంది.

ఏ సంస్థలోనైనా ఆఫీస్ పాలిటిక్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. అయితే వాటిని మనం ఎంత పాజిటివ్‌గా తీసుకుంటున్నామన్నదే ప్రధానం. ఇతరుల బలాబలాలు, సామర్థ్యాల మీద జోకులు, సెటైర్లు వేయడం కొందరికి అలవాటు. అయితే అందరూ వాటిని తేలిగ్గా తీసుకోకపోవచ్చు. ఒకసారి అనుభవం అయిన తర్వాత వారితో వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉంటేనే మేలు. తెగేదాకా దారం లాగే అలవాటున్న వ్యక్తుల నుంచి ఎంతదూరంగా ఉంటే అంత మేలు.

నిజానికి ఒక కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు అందరూ ఒకేలా పని చేసే అవకాశం తక్కువ. కొందరికి చాలా అంశాల్లో పట్టు ఉంటుంది. మరికొంమందికి మితంగా నాలెడ్జ్ ఉండవచ్చు. నాలెడ్జ్ లేకున్నా ఇన్‌ఛార్జ్‌లుగా కూడా ఎంతోమంది ఉంటున్నారు. పెత్తనం చెలాయించడానికి తహతహలాడుతుంటారు. కావాలని వర్క్‌లో ఇన్వాల్వ్ అయి గొప్పోడిని అనిపించుకోవాలనుకుంటారు. తప్పులు చేస్తే దొరకబట్టాలని, బాస్‌కు చెప్పాలని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. చేయని తప్పులను సైతం అంటగడుతుంటారు. పడని వ్యక్తులపై రూమర్స్, గాసిప్స్, చాడీలు క్రియేట్ చేసి ఏదోలా బయటికి నెట్టేలా ప్రయత్నిస్తుంటారు.

అయితే ఈ విషయాలన్నిటినీ పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పని చేస్తున్న కార్యాలయంలో ఇటువంటి పరిస్థితి ఎదురైతే మీ అంత అదృష్టవంతులు లేరనే చెప్పాలి. ఎందుకంటే మీలోని రెసిస్టెన్స్ పవర్, కెపాసిటీ ఆ టైంలో తెలుస్తుంది. అటువంటి సందర్భాలు ఎదురైతే వాగ్వాాదానికి పోకుండా సైలెంట్ అయితే బెటర్. ఇది మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్తేలా దోహదపడుతుంది. ఒక్క చిరునవ్వు ఎదుటివారిపై మీకున్న ప్రేమను, గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేస్తుంది. అర్థం కాకపోతే మళ్లీ అయినా అడగాలి. చెప్పించుకోవాలి. తప్పుగా అర్థం చేసుకోకూడదు. సున్నిత అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్థాయి ఏదైనా ఈక్వెల్‌గా ఉంటే ఏ సమస్యా ఉండదు.

Recent

- Advertisment -spot_img