Homeజిల్లా వార్తలుఅధికారులదే బాధ్యత

అధికారులదే బాధ్యత

– ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి కటింగ్‌ లేకుండా చూడాలి

  • సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు

ఇదేనిజం, చింతలమనేపల్లి : ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి కటింగ్‌ లేకుండా చూడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. బుధవారం దహేగాం మండల కేంద్రంలో దహేగాం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా రైతులు అమ్మిన ధాన్యం విషయంలో వడ్ల కటింగ్‌ చేస్తే ఊరుకునేది లేదన్నారు. వ్యవసాయ,సహకార, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతుల వద్ద నుంచి ఎటువంటి కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, అలాగే రైతుకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించాలని సూచించారు. అధికారులందరూ రైతుల సేవలో నిమగ్నమై రైతాంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపుచ్చారు.కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ దాసరి వేణు, డీసీవో తారామణి, ఎంపీడీవో రాజేశ్వర్‌, సీవో బక్కయ్య, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, సింగిల్‌ విండో చైర్మన్‌ కోండ్ర తిరుపతి గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ రాపర్తి ధనుంజయ్‌, సర్పంచ్‌ పుప్పాల లక్ష్మీ, ఎంపీటీసీ సభ్యులు రాపర్తి జయ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img