యూపీ జలౌన్ జిల్లాలో శనివారం విషాద ఘటన జరిగింది. బార్డోలి గ్రామంలో మనీష్ (23), దీక్ష (20) కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. దీక్షను తమ ఇంటికి మనీష్ తీసుకొచ్చాడు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. కుటుంబ సభ్యులు తిట్టారు. దీంతో వారిద్దరూ కౌగలించుకుని, వేగంగా వెళ్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలు ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. వీరి ఆత్మహత్య వారి కుటుంబాల్లో విషాదం నింపింది.