Homeఫ్లాష్ ఫ్లాష్Olectra E-tippers-భారతదేశంలో మొట్టమొదటిసారి రోడ్డెక్కుతున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్స్-ఆటోమొబైల్ రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి గ్రీన్ సిగ్నల్

Olectra E-tippers-భారతదేశంలో మొట్టమొదటిసారి రోడ్డెక్కుతున్న ఒలెక్ట్రా ఈ-టిప్పర్స్-ఆటోమొబైల్ రెగ్యులేటరీ ఏజెన్సీల నుంచి గ్రీన్ సిగ్నల్

Olectra E-tippers:

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్) 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్ను పొందింది. భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్రీయ మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6×4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డుపైకి వ‌చ్చేందుకు అవసరమైన అన్నిఅనుమ‌తులు సాధించింది.

ఒలెక్ట్రా త‌యారు చేసిన దేశంలోనే తొలి ఈ-టిప్పర్ మన రహదారులకు అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీతో సహా వివిధ ప్రాంతాలలో పరీక్షలు చేసి సర్టిఫికెట్ను జారీ చేశారు.


ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు హోమోలోగేషన్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా.. ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ. ప్రదీప్ మాట్లాడుతూ.. “భారతదేశంలో ఎలక్ట్రిక్ హెవీ వెహికల్ సెగ్మెంట్లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఈ-టిప్పర్ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్గా నిలిచింది.” అని చెప్పారు.

ఈ-టిప్పర్ ప్రోటోటైపును ఢిల్లీ, బెంగుళూరులో ప్రదర్శించామని.. ఇది ఔత్సాహికులకు గొప్ప ఉత్సుకతను, ఆసక్తిని కలిగించిందని తెలిపారు. 20 ఎలక్ట్రిక్ ఈ-టిప్పర్ల మొదటి ఆర్డర్‌కు సంబంధించి ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని ప్రదీప్ తెలిపారు. ఈ-టిప్పర్, ఎలక్ట్రిక్ ట్రక్కుల్లో వివిధ వేరియంట్‌లను కూడా విడుదల చేయబోతున్నామని.. తమ ప్రయాణంలో ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని వెల్లడించారు.

ఆ రంగాల్లో గణనీయమైన మార్పులు

ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్‌.. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాలలో గణనీయమైన మార్పును తీసుకురాబోతున్నాయని కె.వి. ప్రదీప్ వెల్లడించారు. పని ప్రదేశాలకు హెవీ మెటీరియల్ను రవాణా చేసుకోవడానికి, రవాణా అవసరాలకు పెద్ద పరిమాణంలో ఉండే వాహనాలు కావాలనుకునే వారికి ఈ-టిప్పర్లు ఉపయోగపడతాయని చెప్పారు. డీజిల్‌, పెట్రోల్ వాహ‌నాల‌తో పోలిస్తే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ మొత్తం వ్యయం తక్కువ ఖర్చుతో కూడుకున్నది. యజమానులు ఈ-టిప్ప‌ర్ల‌ను వాడ‌టం ద్వారా తమ నిర్వహణ లాభాలను మెరుగుపరచుకోవచ్చు. ఒలెక్ట్రా ఈ-టిప్పర్ మామూలు టిప్ప‌ర్ల‌ మాదిరిగా శ‌బ్దాలు చేయ‌దు. కాలుష్యాన్ని విడుదల చేయ‌దు. పని ప్రదేశాల్లో దీనిని పగలు, రాత్రి తేడాలేకుండా ఉపయోగించుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img