Homeఫ్లాష్ ఫ్లాష్దివ్య ఔషధం 'ఓమ'

దివ్య ఔషధం ‘ఓమ’

ఓమ ప్రతి ఇంట్లో ఉండే దివ్య ఔషదం. చిన్నారుల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరిస్తుంది.

జలుబు, తలనొప్పికి ఓమ దివ్య ఔషధం.

ఓమ పొడిని ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తే జలుబు సమస్య తీరిపోతుంది.

తరచూ ఓమ తింటుంటే గుండె పనితీరు సక్రమంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

అజీర్ణం సమస్య ఉన్నవారు ఓమ, ఉప్పు, మిరియాలు సమభాగాలుగా తీసుకొని చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారు.

వృద్ధులలో సహజంగా వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా ఓమ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ఓమ నూనెతో కీళ్లపై మర్దన చేస్తే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వాంతులు, వికారాన్ని నియంత్రించడంలోనూ ఓమ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఓమను చప్పరిస్తూ తింటే గొంతులో నొప్పి తగ్గుతుంది.

రోజూ ఆహారంలో ఓమను భాగం చేసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు రాకుండా ఉంటాయి.

వేయించిన ఓమను జీలకర్ర నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.

Recent

- Advertisment -spot_img