Homeహైదరాబాద్latest Newsఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో నేటి నుండి...

ఎర్రవెల్లి చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో నేటి నుండి పది రూపాయలకే పేదలకు వైద్య సేవలు

ఇదే నిజం, ముస్తాబాద్: పట్టణంలో పేదలకు శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో వైద్యులు ఎర్రవల్లి అనురాధ, చంద్రశేఖర్ రావులు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను గత మూడు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి విధితమే. ప్రజా ప్రతినిధిగా, నాయకునిగా, వైద్యునిగా డాక్టర్ చంద్రశేఖర్ రావు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్న తరుణంలో ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి డాక్టర్ చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా 10 రూపాలకే కన్సల్టెన్సీ సేవలను నేటి నుంచి అందించడమే కాకుండా రక్త, మూత్ర పరీక్షలకు 50 శాతం ఫీజు తీసుకునేందుకు వైద్య దంపతులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

బీఆర్ఎస్ సీనియర్ నాయకునిగా టీఎస్పీఎస్సీ సభ్యునిగా అనేక సేవలందిస్తూ వైద్యరంగంలో 35 సంవత్సరాలకు పైగా డాక్టర్ చంద్రశేఖర్ రావు వైద్య సేవలను అందిస్తున్నారని పేర్కోన్నారు . ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పేదలకు మరిన్ని వైద్య సేవలను అందించాలని వారు ఆకాంక్షించారు. పది రూపాలకే పేదలకు వైద్య సేవలను అందించడంలో ఎంతో సంతృప్తి ఉందని గతంలో కూడా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య కార్డులను అందించామని డాక్టర్ చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రతి బుధవారం ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. మండలంతోపాటు పరిసర ప్రాంత నిరుపేద ప్రజలకు తన వంతు సహాయంగా వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పది రూపాయల ఫీజు నిర్ణయించామని ఇవి పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యులు చంద్రశేఖర రావు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు, తెర్లుమద్ది సర్పంచ్ ఈసరి క్రిష్ణ, సత్యం, స్త్రీ వైద్య నిపుణులు స్రవంతి, రేష్మ, శ్రీకాంత్, ముక్తార్, భిక్షపతి, అశోక్, భాస్కర్, నవీన్, బాబు, వెంకటేవ్, సుమాంజలి, రేఖ, రాజేశ్వరి, శిరిష, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img