Homeహైదరాబాద్latest Newsఒకప్పుడు ఆమెను చూసి నవ్వే వాళ్ళు.. ఇప్పుడు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసే హాట్ హీరోయిన్

ఒకప్పుడు ఆమెను చూసి నవ్వే వాళ్ళు.. ఇప్పుడు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసే హాట్ హీరోయిన్

దివ్యభారతి.. నటిగా, మోడల్, తమిళ, తెలుగు సినిమాల్లో బాగా ఫేమస్. తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన ఈ నటి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్యాచిలర్ సినిమాలో జి.వీ ప్రకాష్ రొమాన్స్ చేసి తన అందాలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించింది. ఒక్క సినిమాతోనే అన్ని ఇండస్ట్రీల కుర్రాళ్ల చూపులను తన వైపు తిప్పుకునేలా చేసింది. ఆ తర్వాత మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజా వంటి చిత్రాలు చేసింది. జర్నీ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది.

ఈ అమ్మడు ఇప్పడు టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర నటుడు, జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. బుల్లితెర సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఈ తమిళ పొన్ను హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదొక కామెడీ రొమాంటిక్ మూవీ. ఈ సినిమా సక్సెస్ అయితే దివ్య భారతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారడం ఖాయం.

కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్ తన బాడీ షేప్ గురించి ఆటపట్టించేవారని దివ్యభారతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన రూపం చూసి అందరూ నవ్వుకునేవాళ్లని,తనకి పలు పేర్లు పెట్టేవారని అవన్నీ నాపై తీవ్ర ప్రభావం చూపాయని దివ్యభారతి తెలిపింది. తన శరీరాన్ని తానే అసహ్యించుకునేలా ఆ కామెంట్స్ ఉండేవని తెలిపింది. ప్రజల ముందు నడవడానికి కూడా భయపడ్డాను అని తెలిపింది. తర్వాత 2015లో తాను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి, తన మోడలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించినట్లు దివ్యభారతి తెలిపింది. అయితే తాను ఇన్ స్టాలో పోస్ట్ చేసే ప్రతి ఫొటోకి నెటిజన్ల నుంచి చాలా మంచి స్పందన వచ్చేదని,ముఖ్యంగా తన శరీర స్వరూపం చాలా బాగుందంటూ అభినందనలు వచ్చేవని దివ్యభారతి తెలిపింది.

Recent

- Advertisment -spot_img