ఇదేనిజం, పెగడపల్లి: పెగడపల్లి మండలం బతికేపల్లి క్రాస్ రోడ్ దగ్గర బుధవారం సాయంత్రం జరిగి రోడ్డు ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. ఎస్ఐ రామకృష్ణా వివరాల ప్రకారం.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తేలియని టాటా ఏస్ ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో సుద్దపల్లి గ్రామానికీ చెందిన బాలసుల గంగాధర్ మృతి చెందగా, మరో వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.