Homeహైదరాబాద్latest Newsవరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

ఇదే నిజం, కమలాపూర్ : కమలాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో బాబు ప్రారంభించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ 2203, బి గ్రేడ్ రకానికి 2183 చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17 ఉండాలని రైతులకు సూచించారు. అగ్రికల్చర్ ఏవో లక్ష్మారెడ్డి, ఏఎంసి ఇంచార్జ్ రాజా మార్కెట్ కమిటీ సభ్యులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img