HomeసినిమాOTT NEWS : ఈ నెల 24న Netflix ​లో లియో..

OTT NEWS : ఈ నెల 24న Netflix ​లో లియో..

ఇళల దళపతి, కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ నటించిన ‘లియో’మూవీ గత నెల దసరా కానుకగా రిలీజై పాజిటివ్​ టాక్​ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి వసూళ్లను రాబట్టిని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి నెట్‌ఫ్లిక్స్​ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే, భారత్‌లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా ఓ ట్రైలర్‌ను విడుదల చేసింది. విజయ్​కు జోడిగా ఈ సినిమాలో త్రిష నటించగా.. సంజయ్‌ దత్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్రలు పోషించారు.

Recent

- Advertisment -spot_img