టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యం రాజేష్ మెయిన్ లీడ్‌లో నటించిన రీసెంట్ మూవీ ‘మా ఊరి పొలిమేర – 2’. రెండేండ్ల కిందట వచ్చిన పోలిమేర సినిమాకు సీక్వెల్‌గా దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గత నెల థియేటర్లలో రిలీజై పెద్ద హిట్టు కొట్టింది. పోలిమేర ఫస్ట్ పార్ట్ నేరుగా హాట్ స్టార్‌లో రిలీజై పాజిటివ్ తెచ్చుకోగా.. సెకండ్ పార్ట్‌ను మేకర్స్ థియేటర్లలో రిలీజ్ చేసి పెద్ద సక్సెస్‌ను అందుకున్నారు. ప్రస్తుతం పోలిమేర–2 ఓటీటీ ఆడియెన్స్‌ను అలరిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘ఆహా’ స్ట్రీమింగ్ యాప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీని థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.