Homeవిద్య & ఉద్యోగంఓయూ బీహెడ్‌, బీపీహెడ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ వాయిదా

ఓయూ బీహెడ్‌, బీపీహెడ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ వాయిదా

హైద‌రాబాద్ః ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వ‌హించే బీహెడ్‌, బీపీహెడ్‌, డీపీహెడ్ ఫోర్త్ సెమిస్ట‌ర్ రెగ్యుల‌ర్‌, బ్యాగ్‌లాగ్ ఎగ్జామ్స్ వాయిదా వేసిన‌ట్లు ఓయూ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామిన‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. వాయిదా ప‌డిన‌ ప‌రీక్షలు నిర్వ‌హించే తేదీల‌ను త‌రిగి ప్ర‌క‌టిస్తామ‌ని అధికారులు తెలిపారు. ఈ నెల 19 నంచి జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు య‌థాత‌థంగా జ‌రుగుతాయని ఓయూ ఎగ్జామినేష‌న్ అధికారులు తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టులో కేసు విచార‌ణ‌లో ఉన్నందునే ఎగ్జామ్స్ ను వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వ అభిప్రాయాన్ని తెల‌సుకునేందుకు హైకోర్టు కేసు విచార‌ణ‌ను ఈ నెల 15కు వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img