Homeతెలంగాణమా బతుకులు రోడ్డున పడతాయి

మా బతుకులు రోడ్డున పడతాయి

– మమ్మల్ని ఆదుకోండి

– తెలంగాణ ప్రభుత్వానికి ఆటో యూనియన్ నేతలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనే స్కీమ్ తీసుకురావడం పట్ల తాము ఎంతో నష్టపోతామని ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు అంటున్నారు. తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. సుందరయ్య విజాన కేంద్రంలో శనివారం తెలంగాణ ఆటో మోటర్స్‌ డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని, కుటుంబాలతో కలిసి 40 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహన రంగంపై ఆధారపడి బతుకుతున్నామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేవారు. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఉందని, జీవన భృతి కింద నెలకు రూ.15వేలు ప్రభుత్వం అందించాలని కోరారు.ఆటో మోటర్‌ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Recent

- Advertisment -spot_img