Homeజాతీయంఇండియాలోనూ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేత‌

ఇండియాలోనూ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ నిలిపివేత‌

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. ‘మేం పరిస్థితిని రివ్యూ చేస్తున్నాం. ఇండియాలో ట్రయల్స్‌కు విరామం ఇస్తున్నాం. డీసీజీఐ నిబంధనలను పాటిస్తున్నాం. ట్రయల్స్‌పై ఇంకేం మాట్లాడలేం’ అని సీరం ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ఆపేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. యూకే బేస్డ్ ఆస్ట్రా జెనెకాకు చెందిన వ్యాక్సిన్ రెసిపింట్స్‌లో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ఆ కంపెనీ ట్రయల్స్‌ను ఈ నెల 8న ఆపేసింది.

Recent

- Advertisment -spot_img