Homeఅంతర్జాతీయంఏడాది చివరి నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఏడాది చివరి నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తి అయ్యాయి. సానుకూల ఫలితాలు రావడంతో ఉత్పత్తికి మార్గం సుగమం అయ్యింది. ఈ ఏడాది చివరి నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తొలి బ్యాచ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. వ్యాక్సిన్ ఇచ్చిన 28 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్‌కు అన్ని అనుమతులు మంజూరైతే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ కోట్లాది డోసులను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ గతంలోనే ప్రకటించిడం గమనార్హం. వీటిలో సగం వ్యాక్సిన్ డోసులను భారతీయులకే కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు దేశంలో మొత్తం మూడు వ్యాక్సిన్‌లు క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తిని పుణేకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్, జైడిస్ కాడిలా టీకాల క్లినికల్ ట్రయల్స్ పూర్తయి, అనుమతి లభించిన కొద్ది వారాల్లోనే మార్కెట్‌లోకి రానున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్‌తోపాటు జైకోవ్-డి వ్యాక్సిన్‌లు మానవ క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 ఇన్‌స్టిట్యూట్‌లలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img