Homeఅంతర్జాతీయంOzone Layer Increases for the First Time in 35 Years : ఓజోన్​...

Ozone Layer Increases for the First Time in 35 Years : ఓజోన్​ పొరకు మంచి కాలం వచ్చింది..

ఆకాశంలో ఓజోన్‌ పొరను కాపాడుకోవడానికి చేపట్టిన చర్యలు భూమిపై కార్బన్‌ డై ఆక్సైడ్‌ను తగ్గించడంలో కూడా విశేషంగా దోహదపడ్డాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

క్లోరోఫ్లోరో కార్బన్‌(సీఎఫ్‌సీ) ఉద్గారాలను తగ్గించకపోతే ఈ శతాబ్దాంతానికి భూమిపై కార్బన్‌ డై ఆక్సైడ్‌(సీవో2) ఇప్పుడున్న దానితో పోలిస్తే 30% ఎక్కువగా ఉండేదని, ఫలితంగా భూతాపం బాగా పెరిగిపోయేదని ఆ నివేదిక వివరించింది.

సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత(యూవీ) కిరణాలను ఓజోన్‌ పొర అడ్డుకొంటుంది.

ఫలితంగా భూమి మీదకు వచ్చే యూవీ రేడియేషన్‌ తగ్గుతుంది.

1970లో కాలుష్యం కారణంగా(ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్లు) ఓజోన్‌ పలుచబడటం ప్రారంభమైంది.

అంటార్కిటిక్‌ జోన్‌లో ఓ చోట పొరకు చిల్లు కూడా పడింది. దీంతో ప్రపంచం మేల్కొన్నది.

క్లోరోఫ్లోరో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించిన మాంట్రియాల్‌ ప్రొటోకాల్‌ ఒప్పందం జరిగింది.

అధ్యయనంలో భాగంగా మాంట్రియాల్‌ ఒప్పందానికి ముందు పరిస్థితి అలా కొనసాగితే ఎలా ఉండేది… ఒప్పందం తర్వాత ప్రస్తుతం పరిస్థితిని పోల్చి చూశారు.

మాంట్రియాల్‌ ఒప్పందం లేకపోతే ఈ శతాబ్దాంతానికి యూవీ రేడియేషన్‌ ఇప్పుడున్నదానితో పోల్చితే 4.5 రెట్లు ఎక్కువ ఉండేది.

Recent

- Advertisment -spot_img