Paagal first weekend collections | విశ్వక్ సేన్ హీరోగా దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన సినిమా పాగల్.
ఈ సినిమాను నరేష్ కుప్పిలి తెరకెక్కించాడు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రానికి ఊహించిన టాక్ రాలేదు.
అయినా కూడా వసూళ్ల విషయంలో మాత్రం పాగల్ ఫర్వాలేదనిపించాడు.
దానికి ప్రధానంగా విశ్వక్ సేన్‌కు ఉన్న ఇమేజ్ కారణం. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. రెండో రోజు మాత్రం నిరాశ పరిచింది.
శనివారం విడుదలైన ఈ చిత్రానికి రెండు రోజుల్లో దాదాపు రూ. 2.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.
అయితే ఇంకా ఎంత వసూలు చేయాలి.. విశ్వక్ సేన్ ఎంత బాకీ ఉన్నాడనేది ఇప్పుడు చూద్దాం..
- నైజాం: 1.02 కోట్లు
- సీడెడ్: 0.38 కోట్లు
- ఉత్తరాంధ్ర: 0.44 కోట్లు
- ఈస్ట్: 0.13 కోట్లు
- వెస్ట్: 0.09 కోట్లు
- గుంటూరు: 0.17 కోట్లు
- కృష్ణా: 0.11 కోట్లు
- నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.41 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.23 కోట్లు
వరల్డ్ వైడ్: 2.64 కోట్లు
దిల్ రాజు నిర్మాణం.. విశ్వక్ సేన్ క్రేజ్‌తో పాగల్ సినిమాను రూ.6.3 కోట్లకు అమ్మారు.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి రూ.6.5 కోట్ల వరకు షేర్ తీసుకొని రావాలి.
రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.2.64 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.3.9 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అంత వసూలు చేయడం దాదాపు అసాధ్యం.