HomeతెలంగాణBRS,Congress​ మధ్యలో పాయికారి ఒప్పందం

BRS,Congress​ మధ్యలో పాయికారి ఒప్పందం

– రెండూ కుటుంబపార్టీలే
– వారసుల కోసమే ఆ పార్టీల ఆరాటం
– ఎన్నికల ప్రచార సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆరోపించారు. ఈ రెండు కుటుంబపార్టీలేనని విమర్శించారు. తమ వారసులను రంగంలోకి దించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన హుజూరాబాద్​ లో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. వారసుల పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. ఎంఐఎం అధినేత ఒవైసీని చూసి కేసీఆర్​ భయపడుతున్నారని.. అందుకే సెప్టెంబర్​ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని ఫైర్​ అయ్యారు. మజ్లిస్‌కు భయపడి 4శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కారు రూ. 7 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి బీసీ వ్యక్తి సీఎం అవుతారని హామీ ఇచ్చారు. బీజేపీని గెలిపిస్తే.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని.. పేద మహిళలకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img