పాకిస్థాన్ క్రికెటర్ హరీస్ రవూఫ్ ఓ అభిమానితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. భార్య చెప్పినా వినకపోవడంతో ఫ్యాన్‌పైకి దూకాడు. ఈ ఫైట్ విషయంపై క్లారిటీ లేకపోయినా.. హారిస్ రవూఫ్ ను రెచ్చగొట్టేలా సదరు అభిమాని వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సదరు అభిమాని భారత్‌కు చెందినవాడని భావించి హ్యారీస్ రౌఫ్ అతనితో గొడవకు దిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే సదరు అభిమాని తాను పాకిస్థాన్ వాడినని చెప్పడం వీడియోలో కనిపించింది. హ్యారీస్ రౌఫ్ సతీమణితో పాటు ఇతర అభిమానులు అతన్ని ఆపిటన్లు వీడియో చూస్తే అర్థమవుతోంది.