Homeఫ్లాష్ ఫ్లాష్అభిమాని తో గొడవకు దిగిన పాక్ స్టార్ ప్లేయర్… ఇలా చేశాడేంటి.. వీడియో వైరల్..?

అభిమాని తో గొడవకు దిగిన పాక్ స్టార్ ప్లేయర్… ఇలా చేశాడేంటి.. వీడియో వైరల్..?

పసికూన చేతిలో ఓడిపోవడంతో పాక్ క్రికెటర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమికి పాక్ బ్యాట్స్‌మెన్లే ప్రధాన కారణమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. కెప్టెన్ బాబర్ ఆజం, వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మినహా అందరూ విఫలమయ్యారు. ముఖ్యంగా పాకిస్థాన్ కు ఫినిషర్ గా నిలిచిన అజం ఖాన్ అమెరికాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా నిలిచాడు. అంతకుముందు, ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో కూడా అజం ఖాన్ డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఆజం ఖాన్ పై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. అత్యంత ముఖ్యమైన T20 ప్రపంచకప్‌లో అజం తన పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు. వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ఆజం ఖాన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో అజం ఖాన్ గోల్డెన్ డక్ గా అవుటయ్యాడు. కొందరు పాక్ క్రికెట్ అభిమానులు పెవిలియన్‌కు వెళ్లేటప్పుడు కూడా ఆజం ఖాన్‌ను ట్రోల్ చేశారు. ‘మోటా హాథీ’ (లావు ఏనుగు) అంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఆజం ఖాన్‌కు కోపం వచ్చింది. తనపై వ్యాఖ్యానించిన ఓ అభిమానితో గొడవకు దిగాడు. ఈ సన్నివేశంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ క్రికెటర్ పై ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం తగదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆజం ఖాన్ పై ట్రోల్ కూడా చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img