Homeఅంతర్జాతీయం#Kulbhushan #Pakistan : కోర్టులో వాదించుకునేందుకు వీలుగా కీల‌క‌ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం

#Kulbhushan #Pakistan : కోర్టులో వాదించుకునేందుకు వీలుగా కీల‌క‌ బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం

గూఢ‌చ‌ర్యం, ఉగ్ర‌వాదం ఆరోప‌ణ‌ల‌పై భార‌తీయ నేవీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను పాకిస్థాన్ ఖైదు చేసిన విష‌యం తెలిసిందే.

అయితే ఇవాళ ఆ దేశ పార్ల‌మెంట్ కీల‌క బిల్లును పాస్ చేసింది.

పాకిస్థాన్ హైకోర్టులో త‌న అరెస్టును వ్య‌తిరేకిస్తూ అప్పీల్ చేసుకునే బిల్లుకు పార్ల‌మెంట్ ఆమోదం తెలిపింది.

గూఢ‌చ‌ర్యం కేసులో కుల్‌భూష‌ణ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మ‌ర‌ణ‌దండ‌న విధించిన విష‌యం తెలిసిందే.

రీవ్యూ అండ్ రీ క‌న్సిడ‌రేష‌న్ బిల్లు 2020కి జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

అంత‌ర్జాతీయ కోర్టు నియ‌మావ‌ళి ప్ర‌కారం జాద‌వ్ ఇక త‌న కేసును ఫైల్ చేసే అవ‌కాశం ఉంటుంది.

51 ఏళ్ల మాజీ నేవీ అధికారి జాద‌వ్‌కు .. పాకిస్థాన్ మిలిట‌రీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

ఈ కేసులో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానాన్ని ఇండియా ఆశ్ర‌యించింది.

జాద‌వ్‌కు త‌న కేసును వాదించుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని డిమాండ్ చేసింది.

అయితే ఎటువంటి జాప్యం చేయ‌కుండా జాద‌వ్ కోర్టును ఆశ్ర‌యించే రీతిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జూలై 2019లో అంత‌ర్జాతీయ కోర్టు పాకిస్థాన్‌ను ఆదేశించింది.

బిల్లుపై న్యాయ‌శాఖ మంత్రి ఫారోగ్ నాసిమ్ మాట్లాడుతూ.. ఒక‌వేళ బిల్లును పాస్ చేయ‌కుంటే, ఇండియా మ‌ళ్లీ యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లిని ఆశ్ర‌యించేద‌ని, కోర్టు ధిక్క‌ర‌ణ కింద పాక్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసేద‌న్నారు.

బిల్లును పాస్ చేయ‌డం వ‌ల్ల పాకిస్థాన్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న అంశాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Recent

- Advertisment -spot_img