Homeహైదరాబాద్latest Newsపాక్ షాక్స్.. అమెరికా రాక్స్.. పాక్ పై విజయంలో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే డామినేషన్‌..

పాక్ షాక్స్.. అమెరికా రాక్స్.. పాక్ పై విజయంలో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే డామినేషన్‌..

టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ పోరులో అమెరికా ఆల్ రౌండ్ షోతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే ఈ విజయంలో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు కీలక పాత్ర పోషించడం విశేషం. జట్టును గెలిపించిన కెప్టెన్ మోనాంక్ పటేల్ మరియు బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్ భారతదేశంలో జన్మించారు. సూపర్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను గెలిపించిన సౌరభ్ పుట్టింది ముంబైలోనే రంజీ ట్రోఫీలో ఆడాడు. అతను 2010 అండర్-19 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. లెఫ్టార్మ్ పేసర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, జయదేవ్ ఉనద్కత్‌లతో కలిసి ఆడాడు. కానీ అండర్-19 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో అయిదు ఓవర్ల బౌలింగ్ వేసిన సౌరభ్ 16 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. 14 ఏళ్ల తర్వాత అమెరికా తరఫున పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ పాపులర్ అయిన మోనాంక్ పటేల్ గుజరాత్‌లో జన్మించాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను ఓడించిన భారత సంతతి ఆటగాళ్లు సౌరభ్, మోనాంక్ పటేల్ గురించిన సోషల్ మీడియా లో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img