Homeహైదరాబాద్latest NewsInd vs Pak : మ్యాచ్ కోసం ఏం అమ్మాడో తెలుసా?

Ind vs Pak : మ్యాచ్ కోసం ఏం అమ్మాడో తెలుసా?

Ind vs Pak

ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్ చూసేందుకు ఎంతదూరమైనా సరే ట్రావెల్ చేసేందుకు కొందరు ఫ్యాన్స్ వెనకాడరు. స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు డబ్బుల కోసం ఆలోచించరు కొందరు. తాజాగా పాకిస్తాన్ ఫ్యాన్ న్యూయార్క్‌లో ఇండియా పాక్ మ్యాచ్ చూసేందుకు ఏకంగా రూ. 2 లక్షల విలువ చేసే తన సొంత ట్రాక్టర్‌ను అమ్మేశాడట. మ్యాచ్ అనంతరం తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘3వేల డాలర్ల ఖరీదైన టికెట్ కొనేందుకు నా ట్రాక్టర్ అమ్మేశాను. భారత్ స్కోర్ చూశాక మేం ఓడిపోతామని అస్సలు అనుకోలేదు. బాబర్ ఔట్ కాకముందు గేమ్ మా చేతుల్లోనే ఉంది. ఫలితం చూశాక మేం నిరాశ చెందాం. నెగ్గిన వారికి శుభాకాంక్షలు’ అని అన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 6 పరుగుల తేడాతో నెగ్గింది.

Recent

- Advertisment -spot_img