Homeహైదరాబాద్latest News"ఉద్యమ గాన కోకిల" అవార్డుకు ఎంపికైన పలిగిరి రాజేందర్

“ఉద్యమ గాన కోకిల” అవార్డుకు ఎంపికైన పలిగిరి రాజేందర్

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన పలిగిరి రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ధూంధాం ద్వారా ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా వందల ప్రదర్శనలు ఇచ్చి తన ఆట పాటలతో ప్రజలలో చైతన్యం రేకెత్తించిన ఉద్యమ గాయకుడు పలిగిరి రాజేందర్ కు “ఉద్యమ గాన కోకిల” అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక అధ్యక్షులు మేకల చంద్రశేఖర్ యాదవ్, కార్యదర్శి ముక్కెర సంపత్ కుమార్ తెలియజేశారు. ధర్మపురి మండలం నేరెల్ల గ్రామానికి చెందిన పలిగిరి రాజేందర్ కళాకారుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి అవార్డులను సైతం అందుకున్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ పది జిల్లాల వ్యాప్తంగా వందల వేదికలపై తన ఆట పాటలతో ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ ఆవశ్యకతను తెలియజేశాడు. అందుకుగాను ఉత్తర తెలంగాణ పీపుల్స్ మూమెంట్ సంస్థ పలిగిరి రాజేందర్ ప్రతిభను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 12న కరీంనగర్ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు, కవులు,కళాకారులు పలిగిరి రాజేందర్ ను అభినందించారు.

Recent

- Advertisment -spot_img