Homeహైదరాబాద్latest NewsSHOCKING: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతాలు.. రైతులను మోసం చేసి లక్షలు సంపాదన?

SHOCKING: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి బాగోతాలు.. రైతులను మోసం చేసి లక్షలు సంపాదన?

బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్‌ చీకటి బాగోతాలు బయటపడ్డాయి. రైతులను మోసం చేసి లక్షలు సంపాదిస్తున్నావు అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ 7 సీజన్‌లోకి పల్లవి ప్రశాంత్ ఓ సామాన్యమైన రైతు బిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన తన ఆటతీరు, అలాగే ఒక సామాన్యుడు బిగ్ బాస్‌లోకి వెళ్లాడు తనను గెలిపించకోవాలని జనాలు ఓట్లు వేసి అతన్ని విన్నర్ చేశారు.. దీంతో ప్రశాంత్ చాలా ఎమోషనల్ అవుతూ.. నా టైటిల్ ప్రైజ్ మనీ మొత్తం పేద రైతులకు పంచుతాను అంటూ హామి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆయన డబ్బులు పంచలేదు. రీసెంట్‌గా ఒక లక్ష రూపాయలు మాత్రం పంచిన పల్లవి ప్రశాంత్ పెద్ద హంగామా చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన డబ్బు పంచడం అనే ఆలోచనలోనే లేనట్లు తెలుస్తోందని నెటిజన్స్ అంటున్నారు.

రైతుల పేరు చెప్పుకొని బిగ్ బాస్‌ హౌస్‌కు వెళ్లి, విన్నర్ అయ్యావు. 15 లక్షల కారు, విలువైన బంగారు హారం సంపాదించుకున్నావు. 35 లక్షలు సంపాదించావు.. డబ్బులు పేద రైతులకు ఇస్తానంటూ అబద్ధాలు చెబుతావా.. నీ చీకటి బాగోతాలు తెలియడం లేదు అనుకుంటున్నావా.. లక్ష పంచి మళ్లీ ఫేమ్ సంపాదించుకోవాలని చూస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే ప్రస్తుతం ప్రశాంత్..భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే రూ. 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడట. పల్లవి ప్రశాంత్ సంపాదన నెలకు రూ. 20 నుండి 30 లక్షలు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img