Homeఫ్లాష్ ఫ్లాష్విరాట్‌కు పేరెంట‌ల్ లీవ్స్ మంజూరు.. జ‌ట్టులోకి రోహిత్‌

విరాట్‌కు పేరెంట‌ల్ లీవ్స్ మంజూరు.. జ‌ట్టులోకి రోహిత్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి బీసీసీఐ పేరెంట‌ల్ లీవ్స్ మంజూరు చేసింది.

ప్ర‌స్తుతం గర్భవతి అయిన కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది.

దీంతో జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే ఆఖరి మూడు టెస్టులకు అతడు దూరం కానున్నాడు. నవంబర్‌ 27 నుంచి ఆసీస్‌ టూర్‌ ఆరంభంకానుంది.

ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇప్పటికే ఎంపిక చేసిన జ‌ట్టులో బీసీసీఐ పలు మార్పులు చేసింది.

తొడకండరాల గాయం నుంచి కోలుకున్న రోహిత్‌ శర్మను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ టెస్టు జట్టుకు ఎంపిక చేసింది.

వన్డే జట్టులో అదనపు వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. భుజం గాయంతో బాధ‌ప‌డుతున్న‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి స్థానంలో పేసర్‌ టీ నటరాజన్‌ను ఎంపిక చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img