పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల కోసం పోరాడుతోంది. తాజాగా ఇండియా త్రుటిలో ఒక పతకం చేజార్చుకుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్‌లో అర్జున్ బబుతా 208.4 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక దశలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్ ఆ తర్వాత నాలుగో స్థానానికి పడిపోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. చివరి షాట్‌కు 10.5 పాయింట్లు సాధిస్తే అర్జున్ పతకం సాధించేవాడు. కానీ 9.5 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు.