Homeహైదరాబాద్latest Newsవిమానంలో ప్రయాణికుడి వీరంగం

విమానంలో ప్రయాణికుడి వీరంగం

టర్కీలోని ఈజీజెట్ విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్ చేస్తూ.. విమాన సిబ్బంది, పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. ఎడిన్‌బర్గ్‌లో విమానం బయలుదేరినప్పటినుంచి ఆ ప్రయాణికుడు ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ తమకు ఇబ్బంది కలిగించాడని తోటి ప్రయాణికులు పేర్కొన్నారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం ఫ్లైట్ పైకప్పును బాదుతూ మరో వ్యక్తితో వాదనకు దిగాడని చెప్పారు. ఈ ఘటనపై ఈజీజెట్ అధికారులు స్పందిస్తూ..విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో ఎలా మెలగాలో మా సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img