Homeహైదరాబాద్latest Newsచరణ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

చరణ్‌కు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్‌కు డాక్టరేట్ రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ X వేదికగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

‘చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషంగా ఉంది. చరణ్‌కు ఉన్న ప్రేక్షకాదరణ, అతడు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలను గుర్తించి తమిళనాడులోని వేల్స్‌ విశ్వవిద్యాలయం ఈ గౌరవాన్ని ప్రకటించడం ముదావహం. ఈ స్ఫూర్తితో అతడు మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ పేర్కొన్నారు.

కాగా, చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు రీసెంట్​గా డాక్టరేట్​ ప్రకటించింది. ఏప్రిల్ 13న జరగనున్న వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చరణ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆల్​ ఇండియా కౌన్సిల్ ఆఫ్​ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చరణ్​కు గౌరవ డాక్టరేట్‌ అందించనున్నారు.

Recent

- Advertisment -spot_img