జనసేన అవిర్భావం నుంచీ పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. చక్కగా సినిమాలు చేసుకోకుండా రాజకీయం ఎందుకంటూ ఎద్దేవా చేశారు. మీ అన్న చిరంజీవే పాలిటిక్స్‌తో వేగలేక సైడ్ అయిపోయాడు. నువ్వెంత అంటూ కామెంట్లు. సెటైర్లు. వ్యక్తిగత జీవితంపై ఎత్తిపొడుపులు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. వెన్నుచూపలేదు. పార్టీని విస్తరించుకుంటూ ముందుకు సాగారు. ఓటమి అయినా..గెలుపు అయినా సమానంగా తీసుకున్నాడు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. ఈ సారి సరైన వ్యూహంతో ముందుకు సాగాడు. ఏపీ ప్రజల కోసం కూటమితో జతకట్టాడు. పిఠాపురంలో గెలుపు దిశగా ఆయన వెళ్తున్నారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గెలిచిన తర్వాత పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉంది.