హైదరాబాద్: పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ కోసం పనిచేసేందుకు హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలకు దర్శకుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘ఆక్వామెన్’, ‘స్టార్ వార్స్ ఎపిసోడ్ VII-ది ఫోర్స్ అవేకన్స్’, ‘వార్‌క్రాఫ్ట్’ వంటి చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్టు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న దీనిలో బాలీవుడ్ నటుడిని విలన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు పవన్ నటించిన ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన థియేటర్‌లలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇటీవల పవన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రీలుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
పవన్ సినిమాలో హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్
RELATED ARTICLES