Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అయితే శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ”పెద్ది” గ్లింప్స్ విడుదలైంది.ఈ సినిమా గ్లింప్స్ తెలుగులోనే 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు అన్ని భాషల్లో కలిపి 35 మిలియన్ల వ్యూస్‌ని దాటేసింది. ఈ సినిమా గ్లింప్స్ ”పుష్ప 2”, ”దేవరా” సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ‘పుష్ప 2’ సినిమా హిందీ గ్లింప్స్ 24 గంటల్లో 27.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘దేవరా’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ 26 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి. ఈ సినిమా గ్లింప్స్ తోనే ఈ రికార్డులను సాధించడంతో చెర్రీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.