డిసెంబర్ 21న ప్రజలు వింత అనుభూతి పొందనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భూభ్రమణంలో భాగంగా సూర్యుడు చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16 గంటల సుదీర్ఘ రాత్రి, 8 గంటలే సూర్యకాంతి ఉంటుందని చెప్పారు. ఇలా సూర్యడికి భూమి దూరంగా జరిగితే శీతాకాలపు అయనాంతం అని, దగ్గరగా జరిగితే వేసవికాలం అయనాంతం (పగలు ఎక్కువ) అని అంటారు. ఆ రోజున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.