Homeఅంతర్జాతీయం#Twitter #Trump : ట్రంప్‌ ఖాతాపై శాశ్వత నిషేధం

#Twitter #Trump : ట్రంప్‌ ఖాతాపై శాశ్వత నిషేధం

Social media has announced on Twitter that US President Donald Trump’s account will be permanently banned. This is the first time a head of state’s account has been permanently deleted.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ప్రకటించింది.

ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి.

అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

కొద్ది రోజులుగా ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్‌ తెలిపింది.

ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ట్రంప్‌ అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్‌ చేస్తున్నట్టు ప్రకటించాయి.

‘కొద్ది రోజులుగా ట్రంప్‌ అకౌంట్‌ నుంచి వచ్చే ట్వీట్లను సమీక్షిస్తున్నాం. అవి ఎలా ప్రజల్లోకి వెళుతున్నాయి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను పరిశీలించాక అవి మరింతగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తేలింది’అని ట్విట్టర్‌ తెలిపింది.

Recent

- Advertisment -spot_img