Homeహైదరాబాద్Personal aerial vehicle : హైద‌రాబాద్‌లో డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనం

Personal aerial vehicle : హైద‌రాబాద్‌లో డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనం

Personal aerial vehicle : హైద‌రాబాద్‌లో డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనం

Personal aerial vehicle : ప్రస్తుతం పట్టణాలు, మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.

ట్రాఫిక్లో చిక్కుకున్నపుడు మన వాహనం మేఘాల్లో ఎగిరితే ఎంత బావుంటుందో అనే ఊహ ఎంతో ఆనందాన్నిస్తుంది.

అదే నిజమైతే ఎలా ఉంటుంది? ఆ నిజాన్నే మన ముందుంచేందుకు ఐఐటీహెచ్ (IITH) పీహెచ్ స్కాలర్ పర్సనల్ ఏరియల్ వెహికిల్ నమూనాలను రూపొందించారు.

ప్రాక్టీస్ బేస్డ్ పీహెచ్​డీ (Ph D) చేస్తున్న స్కాలర్ ప్రియ బ్రత రౌత్రే (Scholar Priya Brata Routhre).

డిజైన్ డిపార్ట్మెంట్ హెచ్పీడీ ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యూ సహకారంతో ఆస్ట్రేలియాలోని స్పిన్బన్ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి వీటికి రూపకల్పన చేశారు.

ఐదేళ్ల నుంచి పరిశోధనలు జరిపి స్వయం ప్రతిపత్తితో నడిచే పర్సనల్ ఏరియల్ వెహికిల్ (Personal aerial vehicle) 45 నమూనాలను రూపొందించారు.

ఈ పీఏవీలలో (PAV) ఒకరు లేదా ఇద్దరు సులభంగా ప్రయాణించేలా డిజెన్లను తయారు చేశారు.

నూతన ఆవిష్కరణలకు కేంద్రం..

శుక్రవారం ఐఐటీహెచ్లో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి (IITH Director BS Murthy) పీఏవీల నమూనాల ప్రదర్శనను ప్రారంభించారు.

ఈ సంద ర్భంగా బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనాన్ని (The driverless vehicle) అభివృద్ధి చేయడం హర్షణీయమన్నారు.

ఐఐటీహెచ్ (IITH) అంటేనే నూతన ఆవిష్కరణలకు కేంద్రమని కొనియాడారు.

ఐఐటీహెచ్ ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నదని.

ఇందుకోసం రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నామని బీఎస్ మూర్తి వెల్లడించారు.

పీఏవీ డిజైన్​తో విద్యార్థి

ఐఐటీహెచ్​ని అటానమస్ నావిగేషన్ (Autonomous Navigation) ఆధ్వర్యంలో జూలై 4న ఐఐటీహెచ్ ప్రాంగణంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా సెన్సార్లు, జీపీఎస్ ఉపయోగించి ప్యాసింజర్ బేస్డ్ డ్రోన్ల ప్రదర్శన లైవ్ డెమో (Live Demo)కు ఏర్పాట్లు చేస్తున్నామని మూర్తి వివరించారు.

అలాగే రక్త ప్రసరణ మెరుగుపర్చే కుర్చీ లను ఐఐటీహెచ్ డిజైన్ విభాగం పరిశోధకులు రూపొందించారు.

అటూఇటూ కదిలితే రక్త ప్రసరణ మెరుగుపడేలా చిన్న చక్రాలను పూసల్లాగా కుర్చి అంతటా అమర్చారు.

అతి త్వరలోనే దీనిని మార్కెట్లో అందు బాటులో ఉంచనున్నట్టు ఐఐటీహెచ్ అధికారులు వెల్లడించారు.

కొత్త కోర్సులు..

టెక్నాలజీ(Technology), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెక్టార్‌లో కెరీర్ వెతుక్కునే గ్రాడ్యుయేట్లకు ఇటీవలె గుడ్ న్యూస్ చెప్పింది ఐఐటీ హైదరాబాద్(Hyderabad).

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో టెక్నో- ఎంటర్ ప్రెన్యూర్‌షిప్‌లో ఎంటెక్‌(MTech) కోర్సును సంస్థ తాజాగా ప్రారంభించింది.

సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్లలో ఎంటర్‌ప్రెన్యూర్‌ మనస్తత్వాన్ని పెంపొందించి కొనసాగించడానికి అవసరమైన స్కిల్స్, జ్ఞానాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది.

MTech విద్యార్థులు తమ ఎంటర్‌ప్రెన్యూర్ ఐడియాలను విజయవంతమైన వెంచర్‌లుగా మార్చడం కోసం అవసరమైన పర్యావరణ వ్యవస్థను అందించాలని ఐఐటీ హెచ్ భావిస్తుంది.

డిపార్ట్‌మెంట్ నిర్వహించే వివిధ ఈవెంట్లు(Events), వర్క్‌షాప్‌లలో వెంచర్ల వ్యవస్థాపకులు, సహ వ్యవస్థాపకులు, టాప్ మేనేజ్‌మెంట్ స్టార్టప్‌ల యాజమాన్యాలు పాల్గొంటాయి.

వీరి అనుభవాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని ఐఐటీ హైదరాబాద్ పేర్కొంది.

Recent

- Advertisment -spot_img