Homeహైదరాబాద్latest Newsహైడ్రా ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. వారికీ నోటీసులు జారీ

హైడ్రా ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. వారికీ నోటీసులు జారీ

హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిల్‌ను విచారించిన హైకోర్టు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల ఆమోదం తెలిపారు.

Recent

- Advertisment -spot_img