Homeహైదరాబాద్latest Newsజాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్ కు వినతి పత్రం

జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్ కు వినతి పత్రం

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా కేంద్రంలో జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్ కు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కార్యనిర్వాహక సభ్యులు నల్ల శ్యామ్ వినతి పత్రం అందించారు.
దళిత పదం ఉచ్ఛరించవద్దని షెడ్యూల్ కులాలని సంబోధించాలని సర్వోన్నత న్యాయస్థానాలు, కమిషన్లు ఎన్నోసార్లు విస్పష్టంగా ఆదేశించిన… ఎన్ని చట్టాలు నియమాలు ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు, మీడియా పిలుపులోనే ఎస్సీ బాగు కోసం తీసుకున్నా అంశాలను విస్మరిస్తుంటే, వివక్ష కొనసాగిస్తున్నాయి.

జాతీయ ఎస్సీ కమిషన్ కు వినతలు

1.అంటరానితనం,వివక్షత నిర్మూలనే రక్షంగా మండల మెజిస్ట్రేట్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం పేరుతో మండల అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. ఇట్టి కార్యక్రమంలో సంబంధిత అధికారులు హాజరై ప్రభుత్వ పథకాలు, రాజ్యాంగపర రక్షణలు, అవసరమైన సహాయం లభించే ప్రదేశాల పై వివరించాలి. కానీ ఇది ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారింది.
2.ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. 90 శాతం రుణాలు రెండు లక్షల లోపు మాత్రమే ఉంటున్నాయి. కనీసం ఐదు లక్షల సబ్సిడీ 80%తో రాష్ట్రం వాటాతో పాటు కేంద్రం వాటా కూడా ఉండాలి.
3.ఎస్సీ కులానికి జిల్లా కేంద్రంలో, జిల్లాలో సమావేశం మందిరానికి మూడు ఎకరాలు కేటాయించాలి.
4.ఎస్సీ చిరు వ్యాపారస్తులకు సబ్సిడీ రుణాలు పొందుటలో నియమాలు సులభతరం చేయాలి.

Recent

- Advertisment -spot_img