ఇదే నిజం, దేవరకొండ: భారతీయ జనతా పార్టీ దేవరకొండ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య ఆధ్వర్యంలో హరితహారం లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పెంచిన కోనోకార్స్ మొక్కలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ప్రభుత్వం వారు గుర్తించి వాటిని నిషేధించారు కానీ ఎక్కడ కూడా వీటిని తొలగించలేదు మన దేవరకొండ పట్టణంలో రోడ్ డివైడర్ మధ్యలో నాటిన ఈ చెట్టు విపరీతంగా పెరిగి పర్యావరణాన్ని హాని చేస్తున్నాయి వీటివల్ల శ్వాస కోసం వ్యాధులు సైతం వస్తున్నాయి ఇప్పటికే గుర్తించారు. కావున ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా వాటిని తొలగించి వాటి స్థానంలో పకృతి సిద్ధమైన చెట్లు పెంచాలని భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి వాస్కుల సుధాకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేతల వెంకటేష్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు నారాయణదాసుచండీశ్వర్, వలసాని వెంకన్న, ఈడెం రవి, గంజి హరి, గుండాల అంజి, చిత్రం ఉదయ్, ఎర్ర బిక్షపతి, పున్న వెంకటేశ్వర్లు , చీరముని మహేష్, శివ సాయి, తదితరులు పాల్గొన్నారు.